బిగ్ బాస్ విన్నర్ రాహుల్… రన్నర్ ఆఫ్ శ్రీముఖి… చిరంజీవి, నాగ్ చేతుల మీదుగా రాహుల్ కు రూ.50లక్షల చెక్ అండ్ ట్రోపి అందుకున్న రాహుల్…


హైదరాబాద్: బిగ్ బాస్ -3 విన్నర్ రాహుల్…. తీవ్ర ఉత్కంఠ మధ్య మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో నాగార్జున బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 6గంటల నుండి మా టీవీలో బిగ్ బాస్ షో ఫైనల్ పోగ్రాం ప్రారంభం అయింది. పలువురు సినీ తారల తలుకులు… బెళుకులు మధ్య హట్టహాసంగా బిగ్ బాస్ పినాలి మొదలయింది. మొదట అలీరేజ్ ఏలేమినెట్ అయ్యారు. ఇక హౌస్ లో నలుగురు ఉండగా.. హీరో శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లారు. మొదట రూ.10లక్షలు ఆఫర్ ప్రకటించారు నాగ్. ఈ పది లక్షలు తీసుకొని బయటకు వెళ్లేందుకు ఎవరయినా సిద్ధంగా ఉన్నారా అని ప్రకటించారు. హీరో శ్రీకాంత్ కూడా హౌస్మెంట్ ని డబ్బులు తీసుకొని వెళ్లండని కోరారు. నెక్స్ట్ 20లక్షలు ప్రకటించిన ఎవరు వేళ్ళ లేదు. దీంతో ప్లాన్ సి ప్రకారం వరుణ్ సందేశ్ హౌస్ నుండి ఎల్మినెట్ అయ్యారు. ఇక మూడవ ఎల్మినెట్ బాబా భాస్కర్. ఇక హౌస్ లో మిగిలింది రాహుల్ అండ్ శ్రీముఖి. వీరిద్దరిని స్వయంగా నాగార్జున స్టేజి పైకి తీసుకెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ ని విజేతగా నాగార్జున ప్రకటించారు. దీంతో స్టేజి ప్రాంగణం హోరెత్తింది. రూ.50లక్షల చెక్ తో పాటు బిగ్ బాస్ ట్రోపిని రాహుల్ కు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు అందించారు.

– బిగ్ బాస్ హంగామా…

కాగా, చిరంజీవితో పాటుగా తరలి వచ్చిన హీరో శ్రీకాంత్‌ కాంటెస్టులను ఆటపట్టించారు. ఈ క్రమంలో పునర్నవి తనకు ఇష్టమైన కంటెస్టెంట్‌ అని శ్రీకాంత్ చెప్పడంతో ఆమె సిగ్గులు ఒలకబోసింది. ఈ విధంగా ఫినాలే కవ్వింపులతో ముగిసింది. సినీ తారలు అంజలి, క్యాథరిన్‌, రాశి ఖన్నా గ్రాండ్‌ ఫినాలేకు విచ్చేసి సందడి చేశారు. ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్‌ కులకర్ణి పాడిన ‘రాములో రాములా..’ పాటతో స్టేజీ దుమ్మురేపారు. దీంతో బిగ్ బాస్ ముగింపు ఘట్టం ఎపిసోడ్‌ ప్రేక్షకులకు టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని అందించిందనే చెప్పాలి

బిగ్ బాస్ విన్నర్ రాహుల్… రన్నర్ ఆఫ్ శ్రీముఖి… చిరంజీవి, నాగ్ చేతుల మీదుగా రాహుల్ కు రూ.50లక్షల చెక్ అండ్ ట్రోపి అందుకున్న రాహుల్… బిగ్ బాస్ విన్నర్ రాహుల్… రన్నర్ ఆఫ్ శ్రీముఖి… చిరంజీవి, నాగ్ చేతుల మీదుగా రాహుల్ కు రూ.50లక్షల చెక్ అండ్ ట్రోపి అందుకున్న రాహుల్… Reviewed by Ashu Yadav on 9:41 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.