ఉచిత ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం II దివ్యాంగులకు మంచి అవకాశం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి దివ్యాంగులు వివిధ సహాయ ఉపకరణాలను ఉచితంగా మంజూరీ  చేసేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

  అర్హులైన దివ్యాంగులు క్రింద ఇచ్చిన ఆన్లైన్ వెబ్ సైట్ www.tsobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

దరఖాస్తు చేసేందుకు గడువు
18.02.2022 నుండి 28.02.2022లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దివ్యాంగులకు అందుబాటులో ఉన్న యూనిట్స్ క్రింది చిత్రంలో చూడవచ్చు.
ఇతర జిల్లాల వారు ఆయా కలెక్టరేట్ అధికారులు లేదా సంబంధిత శాఖ జిల్లా అధికారుల ద్వారా తెలుసుకొనగలరు.

ధరాఖాస్తు చేసేందుకు కావలసినవి
- సదరం సర్టిఫికేట్ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- కులం, ఆదాయం(మీసేవ ద్వారా తీసుకున్నవి)
- ఫోన్ నెంబర్ 
    పైన పేర్కొన్న జిరాక్స్ & వివరాలతో ఆన్లైన్ కేంద్రాల ద్వారా లేదా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక : ఆన్లైన్ కేంద్రాల ద్వారా చేసే దరఖాస్తులకు నామా మాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. స్వయంగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఉచిత ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం II దివ్యాంగులకు మంచి అవకాశం ఉచిత ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం II దివ్యాంగులకు మంచి అవకాశం Reviewed by Ashu Yadav on 3:44 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.