ఆధార్'తో పాన్ కార్డుకు లింకు చేయకపోతే కలిగే నష్టాలు ఇవే...II Disadvantages of not linking Aadhar and PAN
ఐటీ యాక్టు 1961లోని సెక్షన్ 139AA యాక్టు ప్రకారం ప్రతి ఒక్కరు మీయొక్క పాన్ కార్డుకు ఆధార్తో కార్డుతో తప్పని సరిగా లింకు చేసుకోవలసి ఉంటుంది. లింకు చేసుకునేందుకు 31 మార్చి 2022 వరకు చివరి తేదీగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోను గడువు తేదీ పెంచినప్పటికీ చాలా మంది ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకోలేదు.
లింకు చేసుకోక పోతే నష్టాలూ ఇవే..
- లింకు చేయక పోతే ప్రధాన బ్యాంకుల్లో నిల్వ చేసిన డబ్బుల మీద పడే వడ్డీ పై 20శాతం TDS రేటు వర్తిస్తుంది.
- నగదు డిపాజిట్ వంటి నిర్దిష్ట బ్యాంకు లావాదేవీలు ఒక నిర్దిష్ట పరిమితికి మించి టర్మ్ డిపాజిట్ తెరవడానికి ఫారం 15జీ/హెచ్ సమర్పించేందుకు వీలుండదు.
- లింకు చేయకపోతే పాన్ కార్డు నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది.
- బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం.
- డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం.
- మ్యూచువల్ ఫండ్స్'లో పెట్టె సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్లు ఆగిపోయే అవకాశం ఉంది.
- నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , యూపీఐ ద్వారా చేసే ఆన్లైన్ పేమెంట్ల ద్వారా చేసే ట్రాన్ జాక్షన్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం.
- డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్లలలో సమస్యలు ఏర్పడే అవకాశం.
ఇప్పటికే పలు ప్రధాన బ్యాంకులు ఆయా బ్యాంకు శాఖల్లో నోటీసు బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. లింకు చేయకపోతే బ్యాంకు లావాదేవీలపై TDS వర్తిస్తాయని తేల్చి చెబుతున్నాయి. ఒకవేళ లింకు చేసుకోకపోతే ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సూచనల మేరకు ఖాతాదారులకు వడ్డీ పై 20శాతం TDS వసూలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఇవన్నింటిని అధిగమించాలంటే ఆధార్'కు పాన్ కార్డును లింకు చేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆధార్'తో పాన్ కార్డుకు లింకు చేయకపోతే కలిగే నష్టాలు ఇవే...II Disadvantages of not linking Aadhar and PAN
Reviewed by Ashu Yadav
on
8:53 AM
Rating:
No comments: