మనలో చాలా మంది తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, కొన్ని సంద ర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం ట్రాంజక్షన్ స్టేట్మెంట్లో చూసుకునే వరకు దానికి గల కారణం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మనం ఏటీఎం లావాదేవీలపైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మీరు ఎటిఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలని భావిస్తే , ముందుగా మీరు ఎటిఎం ట్రాంజక్షన్ నియమ నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. . ముఖ్యంగా మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో లేవో ముందే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. . మీరు విత్ డ్రా చేసే అమౌంట్ మీ ఖాతాలో ఉన్నావని నిర్ధారించుకున్న తర్వాతే విత్ డ్రా చేసుకుని ఎటిఎం కు వెళ్లాలని గుర్తుంచుకోండి.
ఒకవేళ మీ బ్యాంకు అకౌంట్ లో తగినంత డబ్బులు లేకపోయినప్పటికీ మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే.. ట్రాంజక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలా ట్రాంజక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. అందువల్ల మీరు మీ అకౌంట్ నుండి ఏటీఎం ద్వారా డబ్బులు తీయడానికి ముందే చెక్ చేసుకోవడం ఉత్తమం. దీనికి గాను ఆయా బ్యాంకులు అందజేసే ఎస్ఎంఎస్, కాల్ సౌకర్యం లేదా గూగుల్ పే, ఫోన్ ఫే, పేటీఎం వంటి వివిధ మార్గాలను కూడా ఎంచుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, యెస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి బ్యాంకులు ఇలాంటి చార్జీలు వసూలు చేస్తున్నాయి.
No comments: