కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తు ప్రాసెస్...II కావాల్సినవి ఏంటీ..?

         

        తెలంగాణ ప్రభుత్వం బాల్య వివాహాలను తగ్గించేందుకు ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మీ , షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టగ ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తుకు కావాల్సినవి ఏంటనేది చాలా మందికి తెలియదు. దీని కోసం  Best Updates దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటి, ప్రాసెస్ మీకు పూర్తిగా ఈ ఆర్టికల్ లో పొందు పరుస్తున్నాము



కల్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకోవాలంటే ప్రధానంగా ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. 



  • అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి(పెండ్లి రోజు నాటికి). 
  • అబ్బాయికి 21 సవంత్సరాలు నిండి ఉండాలి(పెండ్లి రోజు నాటికి). 
  • కల్యాణ లక్ష్మీ పథకానికి  సంబంధించి సంవత్సర ఆదాయ వివరాలు. 
    • ఎస్సీ, ఎస్టీ క్యాటగిరి వాళ్లకు సంవత్సర ఆదాయం  2లక్షలకు మించి  ఉండరాదు. 
    • బీసీ క్యాటగిరి వాళ్లకు సంవత్సర ఆదాయం : గ్రామీణ ప్రాంత వాసులకు ;లక్షా 1,50వేలు, పట్టాన ప్రాంత వాసులకు 2లక్షలకు మించి ఉండకూడదు. 
  • షాదీ ముబారక్ పథకానికి  సంబంధించి సంవత్సర ఆదాయ వివరాలు
    • ముస్లిం మతానికి చెంది యుండి సంవత్సర ఆదాయం 2లక్షలకు మించి ఉండకూడదు.  


కల్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకోవాలంటే ప్రధానంగా ఈ క్రింది తెలిపినవి  కలిగి ఉండాలి. 

  • అమ్మాయి తరఫునుండి కావాల్సినవి
    • అమ్మాయి ఆధార్ కార్డు జిరాక్స్ 
    • అమ్మాయి తల్లిది ఆధార్ కార్డు జిరాక్స్ 
    • అమ్మాయి తండ్రి ఆధార్ కార్డు జిరాక్స్(ఉంటె)
    • అమ్మాయి ఆదాయ సర్టిఫికెట్(Income Certificate ) ఒరిజినల్ 
    • అమ్మాయి కులం సర్టిఫికెట్(Caste Certificate) జిరాక్స్. 
    • అమ్మాయి తల్లిది బ్యాంకు ఆకౌంట్ జిరాక్సు 
    • అమ్మాయి బ్యాంకు అకౌంట్ జిరాక్సు(అమ్మాయి అనాధ అయితే మాత్రమే)
    • అమ్మాయి పాస్పోర్ట్ సైజు ఫోటో. 
    • పెండ్లి ఫోటోలు రెండు(ప్రధానంగా తాళి కట్టేవి లేదా దండలు మార్చుకునేది)
    • అమ్మాయి వాళ్ళది శుభలేఖ(పెండ్లి పత్రిక)(ఒరిజినల్)
    • రేషన్ కార్డు. 
    • అమ్మాయి చదివి ఉంటె పదవ తరగతి మెమో లేదా స్టడీ సర్టిఫికెట్లు. 
  • అబ్బాయి తరపు నుండి కావాల్సినవి. 
    • అబ్బాయి ఆధార్ కార్డు జిరాక్స్ 
    • అబ్బాయి కులం, ఆదాయం జిరాక్సులు (ఇవి అవసరం ఉండదు కానీ కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అడుగుతున్నారు) వేరే రాష్ట్రం వారైతే అవసరం లేదు. 
    • అబ్బాయి వాళ్లది శుభలేఖ(పెండ్లి పత్రిక)(ఒరిజినల్) ( ఇది కూడా అవసరం లేదు కానీ కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అడుగుతున్నారు)
            పైన తెలిపినవి అన్ని సిద్ధమైతే మీ దగ్గరలోని డిజిటల్ సేవా , మీసేవ, ఈసేవ లేదా ఆన్లైన్ కేంద్రాల వద్దకు వెళ్లి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ఫారం లు తీసుకుని నింపండి. ఆ తర్వాత ముందుగా మీ గ్రామా కార్యదర్శి, తర్వాత మీ గ్రామ రెవెన్యూ అధికారి, ఆ తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ (పచ్చ పెన్ను సంతకం అర్హత కలిగినవారు) సంతకాలు తీసుకోవాలి. ఇవి రెడీ చేయగానే ఇంకా కొన్ని మీ గ్రామా, అమ్మాయి తల్లిందండ్రుల సంతకాల చేయించాలి. ధరకాస్తులో ఉన్న ఏయే ఫారం ఎవరితో సంతకం చేయించాలి అనేది క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది. 
  • వీటి తో పాటు మరికొన్ని కావాల్సినవి 
    • మొదటి వివాహ ధ్రువీకరణ పత్రం(ఫస్ట్ మ్యారేజీ)(గెజిటెడ్ అధికారి నుండి తీసుకోవాలి)
    • పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం. (మీ కార్యదర్శి నుండి తీసుకోవాలి)
    • గ్రామ రెవెన్యూ అధికారి(వీ.ఆర్.ఓ) ధ్రువీకరణ పత్రం. (మీ వీఆర్వో నుండి తీసుకోవాలి)
    • పెండ్లి ధ్రువీకరణ పత్రం(మ్యారేజి సెర్టిఫికెట్) పెండ్లయినా సంవత్సరం లోపు అయితే మీ గ్రామా కార్యదర్శి ఇస్తారు. సంవత్సరం దాటితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుండి తీసుకోవాల్సి ఉంటుంది. 
    • తల్లి, తండ్రి వాంగ్మూలం 
    • గ్రామా లేదా మత పెద్దల ధ్రువీకరణ పత్రం. 
   పైన తెలిపినవి అన్ని రెడీ అయితే ఆ దరఖాస్తు సెట్టుతో  డిజిటల్(సీఏస్సీ ), మీసేవ కేంద్రాల్లో కి వెళ్లి ఆన్లైన్ చేయించాలి. ఆ తర్వాత వచ్చిన ఆన్లైన్ ఫారంతో సహా దరఖాస్తును మీ సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వాలి.  దీంతో ఏ పథకం దరఖాస్తు  పూర్తవుతుంది. 

తదుపరి ఆన్లైన్ ద్వారా లేదా రెవెన్యూ కార్యాలయంలో  లో మీయొక్క దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. 

వీడియో ద్వారా ఈ పథకానికి కావాల్సిన వివరాలు తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో వీక్షించండి.  


కల్యాణ లక్షి దరఖాస్తు ఫారములు డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ  క్లిక్ చేయండి. 





కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తు ప్రాసెస్...II కావాల్సినవి ఏంటీ..? కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తు ప్రాసెస్...II కావాల్సినవి ఏంటీ..? Reviewed by Ashu Yadav on 7:09 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.