#TGRJC-2026 : తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ (TREIS) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో (TGRJC) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ (MPC, BiPC, MEC) గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వసతి, భోజన సదుపాయాలను ఈ గురుకులాల్లో కల్పిస్తారు.
దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్చి 16 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కాలేజీలు - అందుబాటులో ఉన్న సీట్లు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇందులో 15 బాలుర కోసం, 20 బాలికల కోసం కేటాయించారు. వీటిల్లో మొత్తంగా 2,996 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు (Important Dates):
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 16 మార్చి 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2026
ప్రవేశ పరీక్ష తేదీ (TGRJC CET 2026): 03 మే 2025 (ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు)
అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
ఎవరు అర్హులు? (Eligibility):
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
2026-27 విద్యా సంవత్సరంలో (మార్చి/ఏప్రిల్ 2026) పదో తరగతి పరీక్షలను తొలి ప్రయత్నంలోనే (First Attempt) పాస్ అయి ఉండాలి. (అంతకుముందు పాసైన వారు అనర్హులు).
నిర్ణీత జీపీఏ (GPA) సాధించి ఉండాలి. (ఓసీ విద్యార్థులకు కనీసం 6.0 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ విద్యార్థులకు 5.0 జీపీఏ ఉండాలి. విద్యార్థులందరికీ ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 4.0 జీపీఏ తప్పనిసరి).
పరీక్ష విధానం (Exam Pattern):
ప్రవేశ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో ఓఎంఆర్ (OMR) పద్ధతిలో జరుగుతుంది.
మొత్తం 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్ (Multiple Choice) తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు.
ఎంచుకున్న గ్రూప్‌ను బట్టి 10వ తరగతి సిలబస్ ఆధారంగా మూడు సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
MPC: ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్.
BiPC: ఇంగ్లీష్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్.
MEC: ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్.
ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ (Bilingual) రెండు మాధ్యమాల్లో ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?: విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రూ. 200 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేయాలి. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
Reviewed by Ashu Yadav
on
11:28 PM
Rating:

No comments: