Cloudburst : మేఘ విస్ఫోటనం
- క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమిటి..?
భారత వాతావరణశాఖ (IMD) ప్రకారం, సాధారణంగా అతిస్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటము లేదా క్లౌడ్బరస్ట్గా (Cloudburst) వ్యవహరిస్తారు. ముఖ్యంగా 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ (100మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెం.మీ, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్ రస్ట్గా వ్యవహరిస్తారు. అయితే, అన్ని క్లౌడ్ ్బరస్ట్లు (Cloudburst) భారీ వర్షాలకు దారి తీస్తాయి.. కానీ, స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తారు.
- ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయి..?
క్లౌడ్ బరస్ట్ (Cloudburst) ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని చెప్పవచ్చు. దేశంలో సంభవించే క్లౌడ్ ్బరస్ట్పనా ఇప్పటివరకు తక్కువ సమాచారమే ఉంది. తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండటంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి.
- ఎలా ఏర్పడతాయి..?
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు అధిక తేమను కలిగి ఉంటాయి. అయితే, వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాలు సాంద్రత పెరిగి (బరువెక్కి) ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్ఫోటము చెందుతాయి. దీంతో తక్కువ పరిధిలో, తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
No comments: