Navodaya VI Class Entrance 2020-21 II నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్ష 2020-21
ప్రతి సంవత్సరం వచ్చే జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 2020-2021 విద్య సంవత్సరమునకు గాను నోటిఫికేషన్ విడుదలయ్యింది. కావున అర్హత గల విద్యార్థులు సకాలములో దరఖాస్తు చేసుకోగలరు. అర్హతలు, ఇతర వివరములు మీకోసం...
అర్హతలు :
- 2019-2020 విద్య సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
- 01, మే 2007 నుండి 30, ఏప్రిల్ 2011 మధ్య కాలములో మాత్రమే జన్మించి ఉండాలి. అంటే 01, మే 2007 తేదీకి ముందు జన్మించి ఉండ కూడదు, 30, ఏప్రిల్ 2011 తర్వాత జన్మించి ఉండకూడదు.
- 2019-2020 విద్యా సంవత్సరములో ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, ప్రభుత్వ ఆమోదం కలిగిన పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
- విద్యార్ధి గ్రామీణ ప్రాంత కోటాలో అడ్మిషన్ పొందాలంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, ప్రభుత్వ ఆమోదం కలిగిన పాఠశాలల్లో చదివి ఉండాలి.
- 15, సెప్టెంబర్, 2019 తేదీ నాటికి 5వ తరగతి పాసై ఉన్న వారు అర్హులు కాదు.
దరఖాస్తుకు కావాల్సినవి :
- 5వ తరగతి చదువుతున్న స్టడీ సర్టిఫికేట్ తో పాటు 4వ తరగతి, 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు.
- విద్యార్ధి పాస్ పోర్ట్ సైజు ఫోటో.
- విద్యార్ధి సంతకము, విద్యార్ధి తండ్రి సంతకము.
పైవి ప్రధానంగా దరఖాస్తు సమయములో అవసరముంటాయి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2019
- పరీక్ష తేదీ : 11 జనవరి 2020, ఉదయం:11. 30నిమిషాలకు.
- హాల్ టికెట్స్ డౌన్లోడ్ ప్రారంభము : 1, డిసెంబర్, 2020
- ఫలితాలు : మార్చి 2020 మొదటి వారము నుండి మర్చి నెలాఖరులోపు.
ముఖ్యమైన లింకులు :
- దరఖాస్తు చేసుకొనుటకు : ఇక్కడ నొక్కండి
- ప్రభుత్వ అధికార నోటిఫికేషన్ ఇంగ్లీష్ లో చూడటం కొరకు : ఇక్కడ నొక్కండి
- ప్రభుత్వ అధికార నోటిఫికేషన్ తెలుగులో చూడటం కొరకు : ఇక్కడ నొక్కండి
- నవోదయ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు : ఇక్కడ నొక్కండి
- నవోదయ ఫలితాలు చూసుటకు : ఇక్కడ నొక్కండి.
- నవోదయ అధికార వెబ్సైట్ చూడటం కొరకు : ఇక్కడ నొక్కండి.
సీటు పొందిన తర్వాత కావాల్సినవి :
- పుట్టిన తేదీని ధృవీకరించే సర్టిఫికేట్
- గ్రామీణ ప్రాంతాలకి చెందిన విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో చదివినట్లు ధ్రువపత్రము అవసరము.
- నివాస దృవీకరణ పత్రము
ఈ వివరాలను ఇంగ్లీషులో పొందుటకు ఇక్కడ నొక్కండి.
మరిన్ని విద్య, ఉద్యోగ, ఇతర ఆన్లైన్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్(BEST UPDATESS) ని సందర్శిస్తూ ఉండండి.
Navodaya VI Class Entrance 2020-21 II నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్ష 2020-21
Reviewed by Ashu Yadav
on
8:16 AM
Rating:
No comments: